అందరికీ పుస్తకాలను చదవగల హక్కు ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 285 మిలియన్ల మందికి కంటిచూపు లేదు, వీరిలో 90% మంది వ్యక్తులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తున్నారు. ఇంకా అనేకమందికి నేర్చుకోవడంలో మరియు శారీరక వైకల్యాలు ఉన్నాయి, కనుక వారికి చదవడంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల కారణంగా వైకల్యాలు ఉన్న వారు చదువుకోలేకపోతున్నారు, ఉద్యోగంలో పాల్గొనలేకున్నారు మరియు సమాజంలో పాలుపంచుకోలేకున్నారు.
Bookshare® అన్నది ఒక ఇ-బుక్ లైబ్రరీ, దీని ద్వారా పుస్తకాలను సులభంగా చదవచ్చు. వైకల్యాలు ఉన్న వారు పుస్తకాలను ఆడియో, బ్రెయిలీ, ఇతర యాక్సెస్ చేయగల ఫార్మాట్లలో చదవగలరు మరియు వారి అనుభవాన్ని వారికి నచ్చిన విధంగా అనుకూలీకరించవచ్చు. ప్రచురణకర్తల భాగస్వామ్యం మరియు స్వచ్ఛంద సేవకుల మద్దతుతో, యాక్సెస్ చేయగల ఫార్మాట్లలో ఉన్న ఇ-బుక్‌లను కలిగిన ప్రపంచంలోని అత్యంత పెద్ద సేకరణను బుక్‌షేర్ అందిస్తోంది. అర్హత ఉన్న వైకల్యాలను కలిగిన వారికి సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.
బుక్షేర్లో అన్నది Benetech యొక్క ఆలోచన, ఇది సమాజ శ్రేయస్సు కోసం సాఫ్ట్‌వేర్‌తో సమాజంలోని అనేక వర్గాలకు సహాయపడే ఒక ప్రభుత్వ-యేతర సంస్థ. 2001 నుండి, వైకల్యాలు ఉన్న వారు తమకు అనుకూలంగా ఉన్న పద్ధతిలో పుస్తకాలను చదవడంలో బుక్‌షేర్ వారికి సహాయపడింది. బుక్‌షేర్ ప్రస్తుతం 70కి పైగా దేశాలలో లక్షలాది మంది వ్యక్తులకు సేవలను అందిస్తోంది.
మీరు బుక్‌షేర్‌ని మీ దేశంలో అందించాలనుకుంటున్నారా? భాగస్వామ్యం పొందడం గురించి తెలుసుకోండి .