బుక్‌షేర్‌ను సందర్శించే అందరికీ సాదరంగా స్వాగతం పలికి, వారికి మంచి అనుభవాన్ని అందించాలన్నది మా కోరిక. ఉత్తమ అనుభవం అందించడం ఎలా అని ఆలోచించినప్పుడు మేము వెబ్ కంటెంట్ యాక్సెసెబిలిటీ మార్గదర్శకాలు (WCAG) 2.0ని అవలంబించాము. వైకల్యాలు ఉన్న వ్యక్తులు వెబ్‌ని మరింత సులభంగా యాక్సెస్ చేయడం మరియు దానిని అందరికీ అనుకూలంగా మార్చడం ఎలా అన్నవి ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి, కనుక అత్యంత ఎక్కువ మంది ప్రేక్షకులు వెబ్‌లో ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేసి, ఇంటరాక్ట్ చేయగలరు. ఉదాహరణకు, కీబోర్డ్ మాత్రమే ఉపయోగించే వినియోగదారులు మరియు బ్రెయిలీ రీడర్‌లు మరియు స్క్రీన్ మాగ్నిఫైయర్‌లు వంటి సహాయ సాంకేతికతను ఉపయోగించే వారు కూడా సైట్‌లను సులభంగా యాక్సెస్ చేయగల విధంగా చేయడంలో మార్గదర్శకాలు సహాయపడతాయి. మార్గదర్శకాలలో వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీకి సంబంధించి మూడు స్థాయిలు (A, AA మరియు AAA) ఉంటాయి. బుక్‌షేర్ వెబ్‌సైట్ కోసం మేము AA స్థాయిని లక్ష్యంగా పెట్టుకున్నాము, అంటే మేము A, AA స్థాయిలకు సంబంధించిన అన్ని ప్రమాణాలను పాటించాము అని అర్థం. సాధ్యమైన చోట, మేము AAA స్థాయి ప్రమాణాన్ని కూడా పాటించాము. మీకు అవసరమైన సమాచారాన్ని మూల్యాంకనం చేయడం మరియు ఆ సమాచారాన్ని బుక్‌షేర్ సైట్‌ని ఉపయోగించి సులభంగా కనుగొనేలా చేయడం కోసం కూడా మేము కృషి చేసాము.